హైదరాబాద్: ఈ ఆరేళ్ల కాలంలో హైద్రాబాద్ కు కేంద్రం ఏమిచ్చిందో చెప్పగలరా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి అవకాశమిస్తే హైద్రాబాద్ ను అమ్మేస్తారని ఆయన చెప్పారు. 

మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తమపై విడుదల చేసిన ఛార్జీషీటుపై ఆయన కౌంటరిచ్చారు.

చార్మినార్, గోల్కొండలను కూడా అమ్మేస్తారని ఆయన చెప్పారు.హైద్రాబాద్ కు ఏం చేశామో తాను చెప్పగలనన్నారు. బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది బీజేపీ కాదా అని ఆయన అడిగారు. 

ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. రైల్వేను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చెప్పాలన్నారు. బీజేపీయే అన్నింటిని అమ్మి ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉందన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ఇతర పార్టీ భాగస్వామ్యం లేదన్నారు. కాశ్మీర్ లో గతంలో పీడీపీ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకొందన్నారు. వేర్పాటువాద పార్టీలతో పొత్తు పెట్టుకొన్న చరిత్ర బీజేపీది అని ఆయన చెప్పారు.

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చార్జీషీట్ పేరుతో అసత్యాలు మాట్లాడారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. 

ఇంటింటికి నీళ్లు  ఇచ్చినందుకు తమపై చార్జీషీటు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.  మీ ప్రధాని బుర్రకు కూడా తట్టని రైతు బంధుని తాము అమలు చేస్తున్నామన్నారు.

తెలంగాణను అభివృద్ది చేసినందుకు  చార్జీషీటు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.  మిషన్ భగీరథ , కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో నీటిని అందిస్తున్నారని కేంద్ర మంత్రి షెకావత్  ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 

also read:టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: కేంద్ర మంత్రి జవదేకర్

ఈ విషయం  కేంద్ర మంత్రి జవదేకర్ కు తెలియదా  అని ఆయన ప్రశ్నించారు. వృద్దులను ఆదుకొన్నందుకా.. పవర్ హాలిడేలు ఎత్తివేసినందుకా తమపై చార్జీషీటు వేశారని ఆయన ప్రశ్నించారు.సిగ్గు లేకుండా బీజేపీ నేతలు , కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అంతర్జాతీయ కంపెనీలను హైద్రాబాద్ కు రప్పించినందుకా మాపై ఛార్జీషీట్ వేశారా అని ఆయన ప్రశ్నించారు. రూ. 5లకే అన్నం పెడుతున్నందుకే మాపై ఛార్జీషీట్ వేశారా అని ఆయన ప్రశ్నించారు.

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినందుకు తమపై ఛార్జీషీట్ విడుదల చేశారా  అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.హైద్రాబాద్ కు ఏం చేశామో తాను చెప్పగలనన్నారు. బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది బీజేపీ కాదా అని ఆయన అడిగారు. 

ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. రైల్వేను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చెప్పాలన్నారు. బీజేపీయే అన్నింటిని అమ్మి ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో లక్షలాది మంది యువత ఉపాధి కోల్పోతోందన్నారు. ఉపాధి పోగొట్టిన బీజేపీపై ఛార్జీషీట్ వేయాలన్నారు.యూపీలో హత్రాస్ లో మైనర్ బాలిక మరణిస్తే కనీసం కుటుంబ సభ్యులు కడసారి చూడకుండానే అంత్యక్రియలు నిర్వహించినందుకు బీజేపీపై  చార్జీషీట్ వేయాలన్నారు.