ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను విడుదల చేశారు.

విపక్షాలు ఉద్యోగాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అర్థసత్యాలు, అసత్యాలతో యువతను గందరగోళానికి గురిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు నిజాలను దాచేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:ఆరేళ్లలో లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం: ఎంపీ కేశవరావు

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేచసిన ఉద్యోగాలపై ప్రకటన చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 2014-2020 మధ్య 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి వెల్లడించారు. ఎవరికైనా అనుమానాలుంటే ఆ శాఖలతో ధ్రువీకరించుకోవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.

అధికారంలోకి వస్తే.. ఉద్యోగాలిస్తామన్నాం, ఇచ్చామన్నారు. పదేళ్లలో ఎన్నో ఉద్యోగాలిచ్చామన్న జానారెడ్డి తెలంగాణ ఎన్నిచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత కూడా అసత్యాలు చెప్పడం బాధాకరమని ఆయన ధ్వజమెత్తారు.