Asianet News TeluguAsianet News Telugu

నాడు ఇల్లు కట్టించిండు... నేడు అదే ఇంట్లో చేయి కడిగిండు, కేటీఆర్ వ్యక్తిత్వంపై ప్రశంసలు

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. సందర్భంగా స్వామి తల్లిదండ్రులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు కేటీఆర్
 

telangana minister ktr lunch at amshala swamy home
Author
First Published Oct 13, 2022, 10:03 PM IST

మంత్రిగా కేటీఆర్ ఎంతో బీజీ... దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలతో నిత్యం పలకరింపులు, సమావేశాలు. అయినా సామాన్యుడికి ఏ అవసరం వచ్చినా నేనున్నాననే భరోసా ఇచ్చే విలక్షణ వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఓ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అంశాల స్వామి వీడియో చూసి తక్షణం స్పందించారు. గత ప్రభుత్వాల వివక్ష, అలసత్వంతో జీవితాన్ని కోల్పోయిన అంశాల స్వామిని ఆదుకోవాలని అనుకున్నారు. గొంతు తడుపుకునేందుకు విషాన్ని తాగుతున్న ఆ గడ్డకు మంచినీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతూనే, ఫ్లోరైడ్ రాక్షసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిన అంశాల స్వామికి అండగా నిలబడ్డారు కేటీఆర్. 

వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం రూ.5.5 లక్షలు మంజూరు చేయించారు. అయన జీవనాధారం కోసం ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఏర్పాటు చేయించారు. టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ ద్వారా ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు కేటీఆర్. తాజాగా గురువారం మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత శివన్నగూడెంలో నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ చెప్పాపెట్టాకుండా వెళ్లారు. ఎవరో మీడియా వాళ్లు ఇంటికి వస్తున్నారని అనుకున్న స్వామి, కేటీఆర్‌ను చూడడంతో ఉబ్బితబ్బియ్యాడు. తన జీవితానికి భరోసా ఇచ్చిన వ్యక్తి స్వయంగా తన ఇంటికి వచ్చి ఆప్యాయంగా యోగక్షేమాలు అడగడంతో స్వామి హర్షం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని మంత్రికి పరిచయం చేశారు. స్వామి అమ్మానాన్నల ఆరోగ్యం గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సెలూన్ ఎట్లా నడుస్తోందని స్వామిని మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.

ALso REad:ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్... అండగా వుంటానని భరోసా

ఆ తరువాత స్వామితో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. పప్పుచారు, పచ్చి పులుసు చాలా బాగున్నాయని చెప్పి మళ్లీ వేయించుకుని తిన్నారు. భోజనం తరువాత స్వామి సోదరి దంపతులకు కొత్త బట్టలను బహుకరించారు కేటీఆర్. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని స్వామికి భరోసా ఇచ్చారు. కేటీఆర్ రాకపై అంశాల స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో మీడియా వాళ్లు తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారని చెప్పారని , కేటీఆర్ వస్తున్న సంగతి తనకు తెలియదని ఆయన అన్నారు. తన జీవితానికి ఆర్థిక భరోసా ఇచ్చి కొండంత అండగా నిలబడ్డ కేటీఆర్ స్వయంగా తన ఇంటికి రావడం చాలా సంతోషాన్నిచ్చిందని అంశాల స్వామి పేర్కొన్నారు. .

Follow Us:
Download App:
  • android
  • ios