తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని .. నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, కాంగ్రెస్ నేతలు మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ లో విశ్వగురు కాదు విష గురు అంటూ చేసిన పోస్టుపై కేటీఆర్ స్పందించారు.
"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇది మీ స్థాయికి ఏమాత్రం తగినది కాదు" అని మంత్రి హితవు పలికారు. "తెలంగాణ ప్రజల త్యాగాలను, దశాబ్దాల తరబడి సాగిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని మీరు పదేపదే అవమానిస్తున్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని..వీటిపై తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రేపు నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని .. నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని కేటీఆర్ శ్రేణులకు సూచించారు.
కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు.
