Asianet News TeluguAsianet News Telugu

ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారో, ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లండి: కోమటిరెడ్డిపై కేటీఆర్ ఫైర్

ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఏపార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఆయనకు అయినా తెలుసా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సభకు వివరిస్తున్నారు. 

telangana minister ktr fires on congress mla komatireddy venkatareddy
Author
Hyderabad, First Published Sep 20, 2019, 7:53 PM IST

హైదరాబాద్‌: మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఏపార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఆయనకు అయినా తెలుసా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సభకు వివరిస్తున్నారు. 

ఈ తరుణంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కేటీఆర్ వేసిన సెటైర్ తో సభలో ఒక్కసారిగా నవ్వులు వెలిశాయి. 

కొత్త పరిశ్రమల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే మైనింగ్ రంగంలో కూడా విపరీతమైన ఆదాయం సాధించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ లో రూ. 7377 కోట్లు రాబడితే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16వేల కోట్లు సాధించిందని తెలిపారు. 

అంతేకాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మెుదటి స్థానంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్లు కేటీఆర్ తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో లక్షకోట్ల మార్క్ ను చేరినట్లు చెప్పుకొచ్చారు. 

మంత్రి కేటీఆర్ ప్రసంగానికి మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఫిర్యాదులపై కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టుపట్టించింది ఎవరో ప్రజలకు తెలుసు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశారు. ప్రజాస్వామ్యమంపై టీఆర్‌ఎస్‌కు నమ్మకం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ కౌంటరిచ్చారు. 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది మీరు కాదా అని నిలదీశారు. రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లో బీఎస్పీని విలీనం చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. మీకో నీతి మాకో నీతా అంటూ మండిపడ్డారు. అవసరమయితే కోర్టులకు వెళ్ళండి అంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios