ఏ మహిళకు ఇలా జ‌ర‌గ‌కూడ‌దు.. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన మంత్రి కేటీఆర్

KTR: నవంబర్ 6న రష్మిక మందన్న తన డీప్ ఫేక్ వీడియోను గురించి స్పందిస్తూ.. టెక్నాలజీ దుర్వినియోగంతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో మన రాష్ట్రంలో ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన అన్ని నిబంధనలు తీసుకొస్తామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.
 

Telangana minister KT Rama Rao (KTR) react to Rashmika Mandanna's deep fake video RMA

KTR react to Rashmika Mandanna's deep fake video:  దేశంలో డీప్ ఫేక్ టెక్నాల‌జీ దుర్వినియోగంపై స‌ర్వత్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ముఖ న‌టి ర‌ష్మిక మంద‌న్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆమెకు మ‌ద్ద‌తుగా చాలా మంది నిల‌బ‌డ్డారు. టెక్నాల‌జీని దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌ల‌కు డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత రోజే మ‌రో న‌టి క‌త్రినా కైఫ్ డీప్ ఫేక్ దృశ్యాలు నెట్టింట ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో చాలా మంది ఆందోళ‌న వ్య‌క్తంచేస్తూ.. ఈ విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు, చ‌ట్టాలు తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ చాలా మంది కేంద్రానికి లేఖ రాశారు.

తాజాగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తారకరామారావు (కేటీఆర్) స్పందించారు.  ఇది ఏ నటికి, ఏ మహిళకు జరగకూడ‌ద‌ని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన అన్ని నిబంధనలు తీసుకొస్తామ‌ని తెలిపారు. తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, రష్మిక మందన్నకు ఏమైందో వార్తల్లో చూశానని చెప్పారు. ఆమెను కించపరచడం, సెలబ్రిటీ అయిన తనలాంటి వారికి ఇలా జ‌ర‌గ‌డం నిజంగా దారుణమ‌ని తెలిపారు.  ఇది తీవ్ర అవమానకరం, ఆగ్రహానికి గురిచేస్తోందని అన్నారు. ఎలాంటి నిబంధనలు తీసుకురావాలన్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకురావాల్సి వచ్చినా మన రాష్ట్రంలో తీసుకురావడం సంతోషంగా ఉందనీ, కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక మంద‌న్నా స్పందిస్తూ.. 

నవంబర్ 6న రష్మిక మందన్న తన డీప్ ఫేక్ వీడియోను గురించి స్పందిస్తూ.. టెక్నాలజీని ఎలా దుర్వినియోగంతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత వీడియోను పంచుకుంటూ.. 'దీన్ని షేర్ చేయడం చాలా బాధగా ఉంది, ఆన్ లైన్ లో నా డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కావడం వల్ల ఈ రోజు చాలా హాని కలిగిస్తున్న నాకు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటివి చాలా భయానకంగా ఉన్నాయని' పేర్కొన్నారు. అలాగే, 'ఈ రోజు ఒక మహిళగా, నటిగా నాకు రక్షణగా, మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను పాఠశాలలో లేదా కళాశాలలో ఉన్నప్పుడు నాకు ఇది జరిగితే, నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నేను నిజంగా ఊహించలేను. మనలో ఎక్కువ మంది ఇటువంటి గుర్తింపు దొంగతనం బారిన పడకముందే మనం దీనిని ఒక సమాజంగా, అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని' పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios