కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కన్నెపల్లి పంపుహౌజ్ ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. 

కన్నెపల్లి పంపుహౌజ్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి లిఫ్ట్ లో వెళ్లారు. ఒక్కసారిగా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు మంత్రి. సుమారు గంట పాటు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇరిగేషన్ సిబ్బంది, సెక్యూరిటీ లిఫ్ట్ అద్దాలను పగులగొట్టి మంత్రి జగదీష్ రెడ్డిని బయలకు తీశారు. 

ఎలాంటి ప్రమాదం జరగకుండా మంత్రి జగదీష్ రెడ్డి సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పరిమితికి మించి ఎక్కువ మంది లిఫ్ట్ లో ప్రయాణించడం వల్లే ఇరుక్కుపోయిందని నిర్వాహకులు స్పష్టం చేశారు.