తెలంగాణ కల్లును ప్రపంచానికి అందిస్తాం

First Published 9, Apr 2018, 7:28 PM IST
telangana minister jagadish reddy good news for gouds
Highlights
మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటన

తాటి చెట్ల నుండి వచ్చే ఉట్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సంబందించిన పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

కుల వృత్తి లో భాగంగా  ప్రమాదవశాత్తు తాటి చెట్ల నుండి పడి శ్వాశ్వతంగా వికలాంగులుగా మారిన కల్లు  గీత కార్మికులతో పాటు మృతి చెందిన కార్మికులకు నష్ట పరిహారం అందించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధి గా హాజరైనారు. మొత్తమ్ 153 మంది కల్లు గీత కార్మికులకు కోటి 3 లక్షల 60 వేళా చెక్కులను ఆయన అంద  చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 60 సవంత్సరాల కాలంలో కుల వృత్తులు పూర్తిగా నిరాధారణ కు గురయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ప్రభుత్వ పరంగా ఏ ఒక్కరికి సహయం అంద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు పెద్ద పిట వేయడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా చర్యలకు పూనుకున్నారన్నారు. అందులో భాగంగానే తెలంగాణా లో అత్యంత ఆదరణ ఉన్న గీతకార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారన్నారు. కళ్ళు గీత కార్మికులు తాటి చెట్లకు చెల్లించే శిస్తును రద్దు చేసిందన్నారు. అంటే గాకుండా వృత్తి లో భాగంగా శ్వాశ్వతంగా వికలాంగులుగా మారిన వారితో పాటు మృతి చెందిన కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాటి చేతలకు శిస్తు రద్దు చేయడం వల్ల ఒక సూర్యాపేట జిల్లాలోనే 47. 63 లక్షలు గీత కార్మికులకు లబ్ది చేకూరినట్లయిందన్నారు. నల్గొండ జిల్లా కల్లుకు ప్రసిద్ధి చెందినదని, ఆ ప్రాధాన్యతను కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహరం కార్యక్రమంలో భాగంగా నాటిన 6 లక్షల తాటి,ఈత చెట్లు పెరిగి పెద్దగౌతున్నట్లు ఆయన తెలిపారు. కల్లు ఆరోగ్య ప్రదాయని అని ప్రాశ్యస్త్యాన్నీ కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో కల్లు కంపౌండ్ లను తొలగిస్తే టి ఆర్ ఎస్ ప్రబుత్వం పునరుద్ధరించిన విషయాన్ని విస్మరించరాదని మంత్రి జగదీష్ రెడ్డి గీత కార్మికులకు ఉద్బోధించారు. కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారికి ప్రభుత్వం ప్రత్యేక భరోసానిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వినూత్న పధకాలను ప్రవేశ పెడుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్,జిల్లా గ్రంధాలయ సంస్థ చెయిర్మన్ నిమ్మల శ్రీనివాస గౌడ్ సంబంధిత అధికారులు,నాయకులూ పాల్గొన్నారు .

loader