చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర శాఖ మంత్రి హరీశ్‌రావు గారు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు.

తెలంగాణ పోరాటయోధులను గౌరవించుకునే సంస్కృతి, సంప్రదాయం మనదన్నారు. గజ్వేల్ లో ఐలమ్మ గారి జయంతి నాడు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కోటీ రూపాయలతో ఐలమ్మ భవనం నిర్మించుకున్నాం అని మరో పదిహేను రోజుల్లో రూ.₹40లక్షలతో ఈ భవనం చుట్టూ కాంపౌండ్ కిచెన్ షేడ్ , టాయిలెట్స్ తదితర నిర్మాణాలు చేయిస్తామన్నారు.

రజకులు కొసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని అన్ని వర్గాల సంక్షేమమే మన ప్రభుత్వం ఆశయమన్నారు..మిలో కూడా మార్పు రావాలని మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని చెప్పారు .

మీ ఆరోగ్యం, మీరు ఆర్థికంగా ఎదిగేలా డ్రైక్లినింగ్, డ్రైయర్స్ లాంటివి చేసుకోవాలని , సోడాతో బట్టలు ఉతకడం వలన మీ ఆరోగ్యం పాడవుతుంది అని.. సిద్దిపేట లో ఏర్పాటు చేసిన విదంగా గజ్వేల్ లో కూడా మోడల్ ధోభీ ఘాట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దర్గాలో హరీశ్ రావు ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. రెండు కోట్లతో నిర్మించనున్న మినీ హజ్ హౌస్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కంది మండలం కాజిపూర్ గ్రామ పరిధిలో ₹4కోట్ల నిర్మించిన జిల్లా పశువైద్య శాల నూతన భవనాన్ని ప్రారంభించారు.