ఒక టీఆర్ఎస్ కార్యకర్త చేతిలో ఓడిపోతున్నానని ఈటల భయపడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓట్లు వేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని హరీశ్ మండిపడ్డారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీపై విమర్శలు మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ఆదివారం జరిగిన సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని హరీశ్ దుయ్యబట్టారు. ఒక టీఆర్ఎస్ కార్యకర్త చేతిలో ఓడిపోతున్నానని ఈటల భయపడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓట్లు వేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని .. త్వరలో మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.