తెలంగాణపై కేంద్రం వివక్ష: అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్రానికి  కేంద్రం నుండి రావాల్సిన నిధులను సక్రమంగా చెల్లించడం లేదన్నారు. రాష్ట్రానికో రకంగా  కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. 

Telangana Minister  Harish Rao  Serious Comments  On  Modi Gvernment  in Assembly

హైదరాబాద్: తెలంగాణపై  కేంద్రం  వివక్ష చూపుతుందని  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  కేంద్రం ప్రభుత్వం  రాష్ట్రానికి  సక్రమంగా నిధులు విడుదల చేస్తే  అభివృద్దిలో  రాష్ట్రం మరింత ముందంజలో  ఉండేదన్నారు.  కేంద్రం నుండి రాష్ట్రానికి  రూ. 1.27 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులను ఇప్పించేలా  కేంద్రంపై  ఒత్తిడి తీసుకురావాలని  ఆయన  బీజేపీ నేతలను కోరారు.  రాష్ట్రానికో  రూల్ ను  కేంద్రం అమలు చేస్తుందన్నారు. 

తెలంగాణ అసెంబ్లీలో  ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  బుధవారం నాడు  ప్రసంగించారు.  విపక్ష సభ్యులు లేవనెత్తిన  సందేహలకు  హరీష్ రావు సమాధానం ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం సెస్ ల రూపంలో  తమ ఖజానాను నింపుకుంటుందన్నారు. 21 శాతం   సెస్ ల రూపంలో   కేంద్రం  ఆదాయం సమకూర్చుకుుందని  హరీష్ రావు తెలిపారు.  పన్నుల్లో 41 శాతం   వాటాను  కేంద్ర ప్రభుత్వం ఇస్తే  రూ. 44, 400 కోట్లు రాష్ట్రానికి దక్కేదన్నారు.   కానీ , కేవలం  30 శాతం మాత్రమే  కేంద్రం  రాష్ట్రానికి ఇస్తుందన్నారు.  

ఏపీ ప్రభుత్వం తెలంగాణ కు  రూ. 17,828 కోట్లు విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి  రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని హరీష్ రావు వివరించారు.  కానీ  ఏపీ ప్రభుత్వానికి  ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 6 వేల కోట్లను  కేంద్రం  చెల్లించిందన్నారు.  తెలంగాణకు  రూ. 17 వేల కోట్లు ఎందుకు చెల్లించలేదో చెప్పాలన్నారు. దేశం మొత్తం  ఒకే పాలసీ ఉంటే  ఏపీకి, తెలంగాణ రాష్ట్రాల మధ్య  ఎందుకు వివక్ష చూపారని  ఆయన బీజేపీ నేతలను  ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల  అభివృద్దికి  మూడేళ్లుగా  కేంద్రం నుండి  రూ. 1350  కోట్లు  తెలంగాణకు  కేంద్రం విడుదల చేయలేదన్నారు.  

ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలను మార్చడం ద్వారా  రాష్ట్రానికి  కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని హరీష్ రావు  తెలిపారు.  దీంతో ఈ ఏడాది  కేంద్రం రూ. 15,033 కోట్ల నిధులపై కోత పెట్టారని  హరీష్ రావు  కేంద్రం తీరును విమర్శించారు.

వ్యవసాయ మోటార్లకు  మీటర్లు  బిగిస్తే ఎఫ్ఆర్‌బీఎంలో  0.5 శాతం  పెంపునకు అనుమతిస్తామని కేంద్రం తెలిపిందని హరీష్ రావు చెప్పారు.  ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు  ఉచితంగా   24 గంటల విద్యుత్  సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  రూ. 10 వేల కోట్లను జెన్  ,ట్రాన్స్ కో సంస్థలకు  చెల్లిస్తున్నట్టుగా  మంత్రి వివరించారు. . వ్యవసాయ మోటార్లకు  మీటర్లు  పెట్టడం లేదనే కారణంగా  రూ 16, 653కోట్లను నిలిపివేశారని  కేంద్రంపై  హరీష్ రావు మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్  రాష్ట్రానికి  రూ. 894 కోట్లు ఇవ్వాలని సూచించినా కూడా  ఇవ్వలేదని  ఆయన తెలిపారు.  

also read:తలసరి ఆదాయం ఎలా పెరిగింది, ప్రజలపైనే అప్పుల భారం: అసెంబ్లీలో భట్టి విక్రమార్క

గతంలో  కేంద్ర ఆర్ధిక మంత్రిగా  అరుణ్ జైట్లీకి  దండం పెట్టి కోరినా  కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు. గతంలో  అసెంబ్లీలో  బీజేపీ పక్ష నేతగా  ఉన్న లక్ష్మణ్  ను కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా తాము కోరిన విషయాన్ని మంత్రి హరీష్ రావు  ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 



 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios