ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చారా?: కిషన్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయకున్నా తామే మంజూరు చేసినట్టుగా చెప్పుకోవడాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. 

Telangana Minister Harish Rao Reacs On union Minister kishan Reddy Comments Over Medical Colleges


హైదరాబాద్:   రాష్ట్రానికి  ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా తామే కాలేజీలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం దిగజారుడు రాజకీయమని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.సోమవారం నాడు తెలంగాణ మంత్రి హరీష్ రావు హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.  కేంద్ర మంత్రి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని  హరీష్ రావు చెప్పారు.. మెడికల్ కాలేజీ ఇస్తే ఎక్కడ ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన. కాగితాలు చూపించాలని కోరారు. కాలేజీలు  ఇవ్వకుండా ఇచ్చామని  కిషన్ రెడ్డి చెప్పడం దిక్కుమాలిన రాజకీయంగా పేర్కొన్నారు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరు చేస్తే తెలంగాణకు  ఒక్క కాలేజీ మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. 

బీబీనగర్ లో ఎయిమ్స్ ఇచ్చినా కూడా  ప్రయోజనం లేదన్నారు..ఎయిమ్స్ లో  ఆపరేషన్  ధియేటర్ లేదన్నారు.  ఆక్సిజన్, బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా ఆపరేషన్లు జరగడం లేదని మంత్రి హరీష్ రావు వివరించారు.భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎయిమ్స్ విద్యార్ధులు ప్రాక్టీకల్స్  చేస్తున్నారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.  

మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క పైసా ఇచ్చిందా? ఇస్తే ఆ వివరాలు చెప్పాలని మంత్రి హరీష్ రావు గవర్నర్ తమిళిసై ను కోరారు.మెడికల్ కాలేజీల విషయంలో తమిళిసై ట్వీట్ సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు దక్కనున్నాయని మంత్రి హరీష్ రావు వివరించారు. 

సమైక్య రాష్ట్రంలో మూడే మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ లలో మూడు మెడికల్ కాలేజీలు వస్తే ఏడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. 
 ఒక్క మెడికల్ కాలేజీకి రూ.510 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారనన్నారు.  ఈ  మెడికల్ కాలేజీలకు  ఎంసీఐ నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. 

రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉన్నాయన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరానికి  ఎంబీబీఎస్ సీట్లను  2901కి  పెంచుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ,  ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

బి కేటగిరీ సీట్లలోను 85 లోకల్ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్య తీసుకున్న విషయాన్ని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో 1067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయన్నారు మంత్రి. 2014లో 613 పీజీ సీట్లు ప్రభుత్వ రంగంలో ఉంటే నేడు అవి 1249కు చేరుకున్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios