Asianet News TeluguAsianet News Telugu

చెరువులో బోటు నడుపుతూ, తామర పువ్వులు తెంపి భార్యకు ఇచ్చిన హరీశ్ రావు ( వీడియో)

టీఆర్ఎస్ అగ్రనేత, తెలంగాణ ఆర్ధిక మంత్రి హారీశ్ రావుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధిపేటలోని కోమటిచెరువులో భార్యాపిల్లలతో సరదాగా గడిపారు మంత్రి. 
 

telangana minister harish rao drives boat in siddipet komaticheruvu
Author
First Published Oct 4, 2022, 3:59 PM IST

టీఆర్ఎస్ అగ్రనేత, తెలంగాణ ఆర్ధిక మంత్రి హారీశ్ రావు రాజకీయాలు, పాలనా సంబంధిత పనులతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయ సంబంధ విషయాలు, ప్రత్యర్ధులపై ఘాటైన విమర్శలు చేయడంతో పాటు తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటారు హరీశ్. తాజాగా ఆయన పీఏ రామచంద్ర రావు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలోని కోమటిచెరువులో భార్యాపిల్లలతో సరదాగా గడిపారు మంత్రి. ఈ సందర్భంగా వారిని బోటులో ఎక్కించుకుని స్వయంగా నడిపారు హరీశ్ రావు. ఈ క్రమంలో బోటు సాగుతుండగా..  తామర పువ్వులు కనిపించగానే దానిని అందుకునేందుకు మంత్రి సతీమణి యత్నించారు. దీనిని గమనించిన హరీశ్ రావు.. స్టీరింగ్ తిప్పుతూనే కలువ పువ్వులను అందుకుని తన భార్యకు అందించి సంతోషపరిచారు. 

ఇకపోతే.. ఉస్మానియా ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవలపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌ఫెక్షన్‌తో కుళ్లిపోయి తొలగించే దశకు చేరుకున్న కాలుకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పునరుజ్జీవం పోశారు. ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ-2 విభాగం ఇందులో కీలక పాత్ర పోషించింది. ఇందుకు సంబంధించిన వార్త కథనంపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. ఉస్మానియా ఆస్పత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘‘ఇన్ఫెక్షన్ సోకి కాలు తీసేయాల్సిన పరిస్థితిలో కూడా.. అత్యాధునిక టెక్నాలజీతో శస్త్ర చికిత్స చేసి అదే కాలుకు పునరుజ్జీవం పోసిన ఉస్మానియా ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమై, నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు చేరువయ్యాయి’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు. 

ఆ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కొమ్మాల గ్రామానికి చెందిన రైతు అయోధ్య.. పొలం పనులు చేస్తుండగా గాజుసీసా గుచ్చుకొని కాలుకు తీవ్ర గాయం అయింది. మూడు రోజుల తర్వాత రైతు పరిస్థితి ఇబ్బందికరంగా  మారడంతో.. కుటుంబ సభ్యులు సూర్యాపేటలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని.. కాలును తొలగించకపోతే గుండె, కిడ్నీపై ప్రభావం చూపుతుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ కుటుంబం.. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లే స్థోమత లేకపోవడంతో రైతును ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

దీంతో అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి.. కాలు మొత్తం సెఫ్టిక్‌ అయినట్లు గుర్తించారు. నాలుగు రోజుల్లోనే కాలు మడిమ భాగం నుంచి తొడ భాగం వరకు చర్మం మొత్తం చచ్చుబడిపోయినట్లుగా నిర్దారణకు వచ్చారు. ఈ ప్రభావం కిడ్నీలు, గుండెపై పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గ్రహించారు. వెంటనే కాలుపై చచ్చుబడిన చర్మాన్ని తొలగించారు. మెరుగైన చికిత్స అందిస్తూ రోజూ శుభ్రం చేశారు. తొలగించిన చర్మం స్థానంలో కొత్త చర్మం కోసం కేసును ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి రిఫర్‌ చేశారు. 

ఆస్పత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ-2 విభాగంలోని వైద్యుల బృందం.. రైతు పరిస్థితిన పరిశీలించారు. అనంతరం అత్యాధునిక టెక్నాలజీ డెర్మటోమ్‌ స్కిన్‌ మెషర్‌ ఎక్విప్‌మెంట్‌తో వేరే కాలు నుంచి తీసిన చర్మాన్ని స్కిన్‌మెషర్‌ ద్వారా ఎక్స్‌పెండ్‌ చేసి తొలగించిన చర్మం స్థానంలో చేర్చి శస్త్ర చికిత్స చేశారు. ఈ అత్యాధునికి ప్లాస్టిక్‌ సర్జరీ ఆపరేషన్‌తో గాయాన్ని పూడ్చి కాలు యథాస్థితికి వచ్చేలా చేశారు.పూర్తిగా ఉచితంగా ఆ రైతుకు చికిత్స చేయడంతో.. ఆ పేద కుటుంబానికి ఎంతో ఊరట కలిగింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios