Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ పై హరీష్ రావు మాటలు నిజమేనా ?

  • వైెఎస్, చంద్రబాబుపై హరీష్ రావు కామెంట్స్
  • కేసిఆర్, కోదండరాం మీద కూడా 
  • వైఎస్ మీద కామెంట్స్ హాట్ టాపిక్
  • దొడ్డి కొమురయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్
telangana minister harish rao alleges ysr s administration

దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మీద తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు విషయంలోనూ, కేసిఆర్ విషయంలోనూ కామెంట్స్ చేశారు హరీష్ రావు. మరి దివంగత సిఎం వైఎస్ విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. వైఎస్ గురించి, బాబు, కేసిఆర్ గురించి హరీష్ రావు ఏమన్నారో చదవండి.

telangana minister harish rao alleges ysr s administration

జనగామ జిల్లాలోని లింగాల ఘనపురం గ్రామంలో తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రులు గా పనిచేసిన వారి ప్రాధాన్యత లు వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాధాన్యత వేరు అని వివరించారు. 

కంప్యూటరే అభివృద్ధి అని ఆనాడు చంద్రబాబు అన్నారని, రియల్ ఎస్టేట్ రంగమే అభివృద్ధి అని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నారని చెప్పారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందించడం, తాగునీరు, సాగునీరు అందించడమే కేసీఆర్ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు. దేశమంతా కేసీఆర్ అభివృద్ధి నమూనా ను ప్రశంసిస్తున్నదన్నారు. వైఎస్ విషయంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చను లేవనెత్తే అవకాశాలున్నాయి.

telangana minister harish rao alleges ysr s administration

నిజానికి వైఎస్ సిఎం గా ఉన్న కాలంలో రియల్ ఎస్టేట్ రంగమే అభివృద్ధి అన్న దాఖలాలున్నాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని, మేము పండగ చేసేందుకు జలయజ్ఞం చేశామని వైఎస్ పదే పదే కామెంట్ చేసేవారు. దానికి చంద్రబాబు కౌంటర్ కూడా వేశారు. తాను వ్యవసాయం దండగ అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. అయితే వైఎస్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి గురించి మాట్లాడినట్లు హరీష్ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.  

 

కోదండరాం తీరు బాగాలేదు : హరీష్

తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటును అప్పుడు వ్యతిరేకించిన  ఇతర శక్తులతో కాంగ్రెస్  చేతులు కలిపిందన్నారు. ఆ శక్తులే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు. జెఏసీ కోదండరాం వైఖరి సరైనది కాదన్నారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటవుతున్నారని ఆరోపించారు. సాగర హారం, మిలియన్ మార్చ్ లో పాల్గొన్నదేవరు? లాఠీ దెబ్బలు, భాష్ప వాయు గోళాలకు ఎదురొడ్డి న దేవరు? శాశ్వతంగా రైతుల  ఆత్మహత్యలు లేకుండా చేయడానికి  సాగునీటి ప్రాజెక్టులకు సి.ఎం.కేసీఆర్ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుంటే తప్పుడు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు." అని హరీష్ విమర్శించారు.

 

దొడ్డి కొమురయ్య దేశముఖ్ లపై  పోరాడిన వీరుడు

"దొడ్డి కొమరయ్య ఆనాటి తెలంగాణ  ఉద్యమానికి స్ఫూర్తి అన్నారు హరీష్. సాయుధ పోరాటానికి ఆయన అమరత్వమే నాంది అయిందన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అని కొనియాడారు. 2001 నుంచి సాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో నూ ఎంతో మంది బలిదానాలు చేశారు. త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ అంటే అందరికీ ముందుగా యాదికొచ్చేది దొడ్డి కొమురయ్యే అన్నారు. జనగామ తాలూకాలో ఆనాడు మొత్తం 60 గ్రామాల్లో విసునూరు దేశ్‌ముఖ్‌దే ఇష్టా‘ రాజ్యం నడిచిందన్నారు. దోపిడీ, హింసకు ఆయన గడీ కేంద్రంగా ఉండేదని, వారిపై తిరగబడినందుకు దొడ్డి కొమురయ్యను కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమికోసం, భుక్తికోసం, వెట్టినుంచి విముక్తి కోసం జరిగిన పోరులో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యిండన్నారు. వెనుకబడిన గొల్ల కులంలో పుట్టిన కొమురయ్య ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చారన్నారు. ఆనాటి దొడ్డికొమరయ్య వారసులు కుర్మలు అన్నారు. కుర్మల ముఖ్యమంత్రి ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా కుర్మలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. తెలంగాణ లో కుర్మలు చాలా శక్తిమంతులయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కోటిన్నర గొర్రెలను పంపిణీ చేయబోతున్నామన్నారు. దేశం మొత్తం మాంసం తయారు చేసి పంపే విధంగా తెలంగాణ కుర్మలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Follow Us:
Download App:
  • android
  • ios