Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలు ఏవైనా.. హుజూర్ నగర్ రిజల్ట్ రిపీట్ అవుద్ది: మంత్రి గంగుల కమలాకర్

 రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. ఎన్నికలు ఏవైనా హుజూర్ నగర్ ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. 

telangana minister gangula kamalakar review on it tower at karimnagar
Author
Karimnagar, First Published Oct 29, 2019, 8:52 PM IST

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. 

ఎన్నికలు ఏవైనా హుజూర్ నగర్ ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఇకపోతే కరీంనగర్లో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తర్వాత ఐటీకి కేరాఫ్ అడ్రస్ కరీంనగర్ అని చెప్పుకొచ్చారు. 


రాష్ట్రంలో మరో ఐటీ సిటీగా కరీంనగర్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెండో అతి పెద్ద ఐటీ టవర్ నిర్మాణం
 
కరీంనగర్ లో జరుగుతుందన్నారు. డిసెంబర్ చివరి కల్లా పనులు పూర్తి చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద ఐటీ టవర్ కరీంనగర్ లో నిర్మాణం అవుతోందని అందుకు సంతోషంగా ఉందన్నారు. 3 ఎకరాల్లో విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. 

 
ఈ టవర్ వల్ల 3,600 మందికి ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు.ఈ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం కరీంనగర్ వాళ్లకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. 
ఐటీ కంపెనీలకు మంచి ఇంన్సెంటివ్స్ ఇచ్చి, ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. 

దసరా నాటికే ఈ ఐటీ టవర్ పూర్తి కావాల్సిందని, కానీ వర్షాల వల్ల కొంత ఆలస్యమైందని తెలిపారు. మరో రెండు వారాల్లోనే రెండు ఫ్లోరు సిద్ధం అవుతాయని, డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో కరీంనగర్ ఐటీ టవర్ రెడీ అవుతుందని తెలిపారు. 

కరీంనగర్ ను రెండో ఐటీ రాజధానిగా మారుస్తామని, అవసరాన్ని బట్టి ఇక్కడ మరో టవర్ నిర్మించేందుకు కూడా ప్రయత్నిస్తామని తెలిపారు. 2020 నాటికి సరికొత్త కరీంనగర్ ను ఆవిష్కరిస్తామని మంత్రి  గంగుల ధీమా వ్యక్తం చేశారు. 

స్మార్ట్ సిటీల పనులు వేగవంతంగా చేపడుతున్నామని, ఈ నెల 31న ఈ అంశంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.350 కోట్లతోనే జరుగుతున్నాయని, ఇకపై స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులు తోడవుతాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

Follow Us:
Download App:
  • android
  • ios