తెలంగాణ మంతరి  గుంగుల కమలాకర్ కు గాయాలయ్యాయి.  చెర్లబూట్కూర్ లో  సభా వేదిక కూలడంతో  మంత్రి  కమలాకర్ గాయపడ్డారు.  

కరీంనగర్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఆదివారంనాడు ప్రమాదం తప్పింది. జిల్లాలోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక కుప్పకూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు గాయాలయ్యాయి. 

వేదికపై పరిమితికి మించి ఎక్కడంతో సభా వేదిక కుప్పకూలింది. దీంతో మంత్రి సహా సభా వేదికపై ఉన్న వారంతా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో జడ్‌పీ‌టీసీ సభ్యుడికి గాయాలయ్యాయి. జడ్‌పీటీసీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించారు. 

ప్రాధమిక చికిత్స చేశారు: మంత్రి గంగుల 

సభా వేదికపై నుండి కింద పడ్డ ఘటనలో తనకు చిన్న చిన్న గాయాలైనట్టుగా మంత్రి కమలాకర్ చెప్పారు. ప్రాథమిక చికిత్స చేశారని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కమలాకర్ ప్రకటించారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.