వరంగల్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలపై, నాయకులపై ప్రజలకు రాను రాను విశ్వాసం పోతోందని ఆయన అన్నారు. ఒకప్పుడు ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేదని, ఇప్పుటి పరిస్థితి మీకు తెలియంది కాదనీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు నోట్లో నాలుకలా ఉంటుందని, బిజెపి సోషల్ మీడియాలో మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. గతంలో రాజకీయాలు, నాయకులు అంటే సమాజంలో గౌరవం, విలువ, విశ్వాసం ఉండేదని ఆయన అన్నారు. రాను రాను నాయకుల మీద, నాయకుల మీద ఏ విధమైన భావన ఏర్పడుతూ వస్తోందో చెప్పాల్సిన పని లేదని అన్నారు.

అది మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తాత్కాలిక విజయాలో కోసం తాత్కాలికమైన ప్రయోజనం కోసం సంప్రదాయాలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రాకూడదని కడియం శ్రీహరి లాంటి నాయకులు ఎక్కువగా కోరుకుంటారని, తన వాళ్లు కూడ4ా ఈ రోజు అదే కోరుకుంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. 

నిజానికి రాజకీయ నాయకులు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్లు తప్ప ఇబ్బంది పెట్టడం కోసమో, సొంత ప్రయోజనాల కోసమో ఆశించేవాళ్లు కాదని, కానీ ఆలా చిత్రీకరించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు మానవ సంబంధాల్లోనే కాకుండా రాజకీయ నాయకులకూ ప్రజలకూ మధ్య ఉండే సంబంధాల్లో బాధాకరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటుండడం ఇవాళ్ల మనం చూస్తున్నామని, కాబట్టి ఏదో ఒకనాడు పెరుగుట విరుగుట కోసమే అన్నట్లుగా అలాంటివన్నీ పెరుగుతాయి.. మళ్లీ ఎక్కుడో విరుగాతనయనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.