తన కాన్వాయిలోని డ్రైవర్ చనిపోవడంతో... మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఆ డ్రైవర్ పాడె కూడా మంత్రి ఎర్రబెల్లి మోయడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడిన సంగతి తెలిసిందే. 

జనగామ జిల్లా లింగాల ఘనపురం, మండలం చిటూరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. మంత్రి కారు వెనకాల వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు డ్రైవర్ పార్ధసారది, సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన చనిపోయిన డ్రైవర్‌ పార్థసారథి, పూర్ణేందర్‌ అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దయాకర్‌రావు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. డ్రైవర్‌ పార్థసారథి పాడె మోశారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 
జనగామ జిల్లా చీటూర్‌ వద్ద శనివారం అర్ధరాత్రి మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ పార్థసారథి (35), సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పూర్ణేందర్‌(30) మృతి చెందారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న గన్‌మెన్‌ నరేష్‌, అటెండర్‌ తాతారావు, ప్రైవేటు పీఏ శివ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి జనగామ జిల్లా కేంద్రంలోనే ఎర్రబెల్లి ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.