వరి నాటు యంత్రాన్ని నడిపిన తెలంగాణ మంత్రి (వీడియో)

First Published 9, Aug 2018, 2:49 PM IST
telangana Minister driving paddy machine
Highlights

నందిగామ మండల కేంద్రంలో "రైతుబంధు జీవిత బీమా దృవీకరణ" పత్రాలను రైతులకు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. దేశంలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. 

నందిగామ మండల కేంద్రంలో "రైతుబంధు జీవిత బీమా దృవీకరణ" పత్రాలను రైతులకు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. దేశంలో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. రైతుకు ప్రీమియం చెల్లించి బీమా కల్పించిన ఎకైక ప్రభుత్వం తెలంగాణ.  రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు, కోటి యాబై లక్షల ఎకరాలకు, ఎకరాకు రూ. 8,000 చొప్పున మొత్తం రూ. 12,000 కోట్లను అందిస్తున్నాం.

కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల పడకూడదనే మంచి ఉద్యేశంతో రాష్ట్రంలో రైతుబంధు జీవిత బీమా అమలు చేస్తున్నాం.ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 2,271 చొప్పున మొత్తం 636 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం  LIC సంస్థకు చెల్లించడం జరిగింది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులు బీమా కు అర్హులు.అగస్టు 14 రాత్రి నుండి రైతుబంధు జీవితబీమా అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది అగస్టు 13 వరకు వర్తిస్తుంది.

కుటుంబానికి ఆదారమైన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ కుటుంబానికి ఆసరాగా రూ. 5 లక్షల  బీమా అందుతుంది.రైతు చనిపోయిన పది రోజులలోనే నామినీకి రూ. 5 లక్షల చెక్కు అందుతుంది. ఈ రూ. 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా 8 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 40,000 లభిస్తుంది.కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఈ డబ్బులతో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బతుకుతుంది.

రైతుబంధు పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తాం.ఇప్పటికే వెరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలి. రంగారెడ్డి జిల్లాలో 2,42,000 మంది రైతులకు గాను 1,89000 మంది రైతులను వ్యవసాయ శాఖ అధికారులు కలిసి వివరాలను సేకరించారు.వెనుకబడిన షాద్ నగర్ ప్రాంతంలో సూక్ష్మ బింధు సేద్యానికి ఆధిక ప్రాధాన్యత ఇస్తాం. అవసరమైనన్ని యూనిట్లను అందజేస్తాం.  షాద్ నగర్ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్, రైతులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

                             "

loader