Bombay blood Group: గర్భిణికి అరుదైన 'బాంబే బ్లడ్' దానం చేసిన తెలంగాణ వ్యక్తి 

Bombay blood Group: నిండు గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమైంది. స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఓ దాత ముందుకొచ్చి గర్భిణీ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు చోటుచేసుకుంది. 

Telangana man donates rare Bombay blood to pregnant woman in AP KRJ

Bombay blood Group: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలానికి చెందిన సుమ అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను నర్సాపురంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో తరలించారు. కానీ ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో..  డెలివరీ చేయాలంటే..  రక్తం ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఆమెకు టెస్టులు చేసి చూడగా ఆమెది అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ (bombay blood group) అని గుర్తించారు.

ఈ బ్లడ్ గ్రూప్ చాలా అంటే.. చాలా అరుదు. 10,000  మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఈ బ్లడ్ గ్రూప్ ఇది. ఇక ఐరోపాలో మిలియన్ మందిలో ఒకరిలో కనిపిస్తుంది. HH బ్లడ్ గ్రూప్ రక్త దాతల కోసం ఆమె కుటుంబం చాలా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరికి ఆమె కుటుంబం స్థానిక వైఎస్ఆర్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజును సంప్రదించింది. వెంటనే స్పందించిన ఆయన బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న తెలంగాణ వ్యక్తిని స్పందించారు. ఆ వ్యక్తి  కూడా  రక్త దానం చేయాడానికి అంగీకరించారు. వెంటనే ఆ వ్యక్తి నర్సాపురం వెళ్లిన రక్తం ఇచ్చి గర్భిణీ ప్రాణాలకు కాపాడారు. తెలంగాణకు చెందిన వ్యక్తి సకాలంలో విరాళం అందించడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. భారతదేశంలో దాదాపు 179 మంది వ్యక్తులు, 10,000 మందిలో 1 ఫ్రీక్వెన్సీతో "బాంబే బ్లడ్ గ్రూప్" కలిగి ఉన్నారని అంచనా.

చాలా అరుదు..

సాధారణంగా రక్తం అవసరమైతే బ్లడ్‌ బ్యాంకులను సంప్రదిస్తారు. లేదా చుట్టుపక్కల ఎవరైనా దాతలు ఉంటే వారి నుంచి తీసుకుంటారు. కానీ ‘బాంబే’ బ్లడ్‌ గ్రూప్‌ విషయానికి వస్తే.. భారతదేశంలో సుమారు 10 వేల మందిలో ఒకరు మాత్రమే ఈ బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుందట. ‘ఈ గ్రూప్‌ వాళ్లను వెతకడం చాలా కష్టం. సాధారణ పరీక్షల వల్ల బాంబే బ్లడ్‌ గ్రూప్‌ గురించి తెలుసుకోలేం.

అందుకే చాలా మందికి తమది బాంబే బ్లడ్‌ గ్రూప్‌ అని తెలీదు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో ‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ కానప్పుడే వారికి బ్లడ్‌ గ్రూప్‌ తెలుస్తుంది. 1952లో బాంబే (ముంబై) నగరంలో ఈ బ్లడ్ గ్రూప్‌ను తొలిసారి గుర్తించారు. దీంతో ఈ బ్లడ్ గ్రూప్‌కు బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు వచ్చింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios