Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..  ఓటర్లు ఎంతమంది?  ఎన్ని పోలింగ్ కేంద్రాలు? 

TS Loksabha Elections 2024: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. నిన్నటి వరకు ప్రచార హోరుతో మారుమోగిపోయిన మైకులన్ని మూగబోయాయ్. రేపు పోలింగ్ జరుగనున్నది. 

Telangana loksabha Election arrangements 2024 set all arrangements KRJ
Author
First Published May 12, 2024, 6:41 PM IST

TS Loksabha Elections 2024: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రచార పర్వానికి స్థిరపడింది. ఇక మరి కొన్ని  గంటలలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తతో  రాష్ట్రంలో 144 సెక్షన్ ను విధించింది. అలాగే టీవీలలోనూ సోషల్ మీడియాలోనూ ఎలాంటి ప్రచారం ఆర్భాటాలు చేయకుండా నిషేధం విధించింది. అలాగే ఎగ్జిట్ పోల్స్,  ఇతర ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 

ఎంతమంది బరిలో నిలిచారో తెలుసా? 

తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలలో రేపు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికలలో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వీరిలో 475 మంది పురుషులు గాక 50 మంది మహిళలు ఉన్నారు. కాగా  సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ఇక అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 35,609 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈ ఎన్నికల విధులలో దాదాపు రెండు లక్షల 80 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అలాగే 9900 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది ఎన్నికల సంఘం.  అలాగే ఈ ఎన్నికల కోసం ఒక లక్ష 9  వేల ఈఏంఐలను ఉపయోగించమన్నారు.

ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు? 

ఇక ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 32వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1 కోటి 65 లక్షల 28 వేల మంది పురుషులు కాగా, 1 కోటి 67 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే.. 1.88 లక్షలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా.. 21, 690 మంది హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. పోలింగ్ ముగిసే వరకూ కట్టుదిట్టమైన నిఘా ఉండాలని ఈసీ అదికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా అక్రమ నగదు, మద్యం పంపిణీ, రవాణాను నియంత్రించాలని కోరారు.ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనున్నది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనున్నట్టు ఈసీ ప్రకటించింది.

ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం
 
ఇక మీడియాకు, రాజకీయ పార్టీలకు దిశా నిర్దేశం జారీ అయింది. మే 12, 13 తేదీల్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్‌సైట్లలో ఎలాంటి పొలిటికల్ యాడ్స్ ఇవ్వకూడదని ఈసీ ఆదేశించింది.  అదే సమయంలో జూన్ 1 సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios