Telangana Election 2024: ఓటెత్తారు.. తెలంగాణలో ఎంత పోలింగ్ నమోదైందంటే?

Telangana Election 2024: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది.  ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు. ఉదయం  7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే.?  

Telangana Lok Sabha polls 61.16% voter turnout recorded till 5pm krj

Telangana Lok Sabha Election 2024 : తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని  17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగింది. కానీ, సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.  

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతించారు. ఇందులో భునవగిరిలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇక హైదరాబాద్ అత్యల్పంగా 39.12 శాతం పోలింగ్ నమోదైంది. చివరి వరకు పోలింగ్ శాతం ఇక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

ఆ నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్

ఇక తెలంగాణలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది

కట్టుదిట్టమైన భద్రతా
 
తెలంగాణలోని 17 స్థానాల్లో మొత్తం 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరి కోసం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్భ భద్రత కోసం దాదాపు 73 వేల మందికి పైగా పోలీసులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ జరిగింది.  500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఫోర్సెస్,  7 వేల మంది ఇతర రాష్టాల హోంగార్డులతో  భద్రతా ఏర్పాట్లు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios