తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్: ఈ నెల 12న ఎన్నిక
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక గురువారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నెల 12న డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ ఎన్నికకు గురువారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12న డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 11వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 మంది ఎమ్మెల్సీలున్నారు. వీరిలో 36 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ పదవిని బండ ప్రకాష్ కు కట్టబెట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ పదవిని బండ ప్రకాష్ ఈ నెల 11న నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. తెలంగాణ శాసమండలి చైర్మెన్ గా సుఖేందర్ రెడ్డి రెండో దఫా ఈ పదవిలో కొనసాగుతున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ గా నేతి విద్యాసాగర్ కొనసాగిన విషయం తెలిసిందే.తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ గా నేతి విద్యాసాగర్ రెండు దఫాలు కొనసాగారు. 2015 జూన్ లో ఆయన రెండో దఫా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో రెండో టర్మ్ కూడా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన నేతి విద్యాసాగర్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.