కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రపై సెటైర్లు వేశారు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. భట్టి ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అది గమనం, గమ్యం లేని పాదయాత్ర అన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రపై సెటైర్లు వేశారు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆదివారం మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, భట్టి విక్రమార్క తన ఆరోగ్యం పాడుచేసుకోవద్దన్నారు. భట్టి ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అది గమనం, గమ్యం లేని పాదయాత్ర అన్న సుఖేందర్ రెడ్డి.. నల్గొండ క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నేతలు సభ పెడితే అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిస్థిమితం వుండదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. హుజుర్‌నగర్, కోదాడ, మిర్యాలగూడ, జడ్చర్ల హైవే తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్రం పెత్తనం కోసం తెలంగాణ రాలేదని ఆయన చెప్పారు. 

ALso Read: ఆయనో జులాయి .. కేటీఆర్‌కు ఫిలిం ఇండస్ట్రీలో కావాల్సింది వాళ్లే : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఒక పరిపక్వత లేని, బాధ్యత లేని, జూలాయి మంత్రని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ చిత్ర పరిశ్రమలో ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారో అందరికీ తెలుసునంటూ రేవంత్ కామెంట్ చేశారు. దర్శకుడు నర్సింగరావు అలాంటి వ్యక్తి కాకపోవడం వల్లే కేటీఆర్ ఆయనను కలవడం లేదని రేవంత్ చురకలంటించారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని రేవంత్ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన కుప్పకూలిందని.. బీసీ కేటగిరీలో వున్న అన్ని కులాలు, ఉప కులాలకు లక్ష రూపాయల పథకం అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరులు, ఉద్యమకారులంటే కేసీఆర్‌‌కు చిన్న చూపని.. వాళ్లంటే ఆయనకు అసూయ, ద్వేషమని రేవంత్ వ్యాఖ్యానించారు. చివరికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉద్యమకారులకు ఇలాంటి అవమానం జరగలేదన్నారు. మోడీ నాకు మిత్రుడు, ఇద్దరం కలిసి ఆలోచనలు పంచుకుంటామని కేసీఆర్ చెప్పారని రేవంత్ దుయ్యబట్టారు. ఢిల్లీలో బీజేపీ, హైదరాబాద్‌లో కేసీఆర్ వుండాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ , కేసీఆర్ వ్యాఖ్యలతో వాళ్లిద్దరూ ఒక్కటేనని స్పష్టత వచ్చిందన్నారు.