ఓవర్ యాక్షన్ చేసిన ఎసిపి పై విచారణ దాడి ఘటనను డిజిపికి వివరించిన జర్నలిస్టులు మహిళా జర్నలిస్టుపై చేయి వేసిన ఎసిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్  

ప్రగతి భవన్ వద్ద మీడియా పట్ల ఓవర్ యాక్షన్ చేసిన ఎసిపి వెంకటేశ్వర్లు పై విచారణకు ఆదేశించారు డిజిపి. కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ఏసిపి వెంకటేశ్వర్లు తో పాటు ఇతర పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్ శర్మకు వినతిపత్రాన్ని అందించడం జరిగింది.

దీనిపై స్పందించిన డిజీపీ వెంటనే విచారణ జరపాలని సీపీ కి అదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ , రాష్ట్ర నాయకులు రాజేష్ , శ్రీకాంత్ రెడ్డి , హెచ్ యూ జే అధ్యక్ష , కార్యదర్శి రియాజ్ అహ్మద్ , శంకర్ గౌడ్ , ఎలక్ట్రానిక్ మీడియా సెల్ అధ్యక్షులు బాలకృష్ణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి , శ్యామ్ సుందర్ , సుధాకర్ రెడ్డి , మల్లేష్, గిరిబాబు, దయాకర్ గౌడ్ , భూషణ్ , ఉపేంద్ర , నాయుడు తదితరులు పాల్గొన్నారు.