రోడ్డు ప్రమాదంలో మరో తెలంగాణ జర్నలిస్టు మరణించారు. వి6 లో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా పనిచేస్తున్న డి.ప్రసన్న కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొడకండ్ల గ్రామ శివారులో AP23R 1958 గల కారు లో సిద్దిపేట కు వస్తుండగా కారు డివైడర్ కు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్నకుమార్ సొంత ఊరు గోదావరిఖని. వి6 లో రిపోర్టర్ గా చేరకముందు టిన్యూస్ స్టేట్ బ్యూరోలో కెమెరామెన్ గా పనిచేశారు. అంతకుముందు హెచ్ఎం టివిలో కెమెరామెన్ గా పనిచేశారు ప్రసన్న. ప్రసన్న మృతి జర్నలిస్టు వర్గాల్లో ఆవేదనను నింపింది.

 

మంత్రి హరీష్ సంతాపం.. 

వి6 రిపోర్టర్ ప్రసన్న మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. విషయం తెలియగానే ప్లీనరీ సమావేశం నుంచి.. హుటాహుటినా..
నేరుగా గజ్వేల్ కు బయలుదేరారు మంత్రి హరీశ్ రావు. ప్రసన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు.

- ఉమ్మడి మెదక్ జిల్లా వి6 స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొడకండ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొద్ది సేపటి క్రితం  మృతి చెందారు. 

- తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రసన్న మృతి చెందిన వార్త వినగానే చలించిన మంత్రి హరీశ్ రావు.

- ప్రసన్న మృతి ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్టు రంగానికి తీరని లోటు అని హరీష్ తెలిపారు.

 

జర్నలిస్ట్ ప్రసన్న మృతిపై సహచర వి6 రిపోర్టర్ ఆవేదనతో రాసిన పోస్టు ఇది...

మిత్రమా.. అప్పుడే ఇక సేలవ్ తీసుకున్నావా..?

తోడబుట్టిన తమ్ముని పెళ్ళికి రావాలని నిన్ననే.. ఆఫీస్ కొచ్చి పిలిచావు. కనిపించిన వారితో.. మెదక్ కబుర్లు చెప్పావు. 
నీ మాటలు.. విని 24 గంటలు కాకముందే.. కనిపించకుండా పోయావు. ఎంత పనిచేశావు ప్రసన్న.
ఎంతో కష్ట పడి.. కెమెరా మెన్ నుండి సీనియర్ రిపోర్టర్ గా ఎదిగావు.
ఉమ్మడి రాష్ట్రం లో.. ఏ జిల్లాకు  భాద్యతలు ఇచ్చిన ఇష్టంతో చేశావు.
ఉద్యమ సమయంలో.. సైతం విజయవాడకు వెళ్లి రిపోర్టర్ గా పనిచేసి నిరూపించావ్.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకా.. ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా ఎంతో చక్కగా పనిచేసినవ్.

మెతుకు జిల్లా మెదక్ కష్టాలు కండ్లకు కట్టినట్టుగా చెప్పినవ్.

మరి ఇప్పుడు ఎవరు చెప్తారు మిత్రమా.. నువ్వు ఎక్కడికి వెళ్లినా ప్రేమతో, ఇష్టం తో చేసేవాడివి.. పెద్ద సారు నుండి మాట రాకుండా పని చేశావు.
మరిగిట్ల అర్థంతంగా.. వెళ్ళిపోతే ఎలా.. రా.. ప్రసన్న..
ఎవరైనా ప్రమాదంలో ఉంటే.. నువ్వే ముందుండేది. మరి ఇప్పుడేవరుంటారు ప్రసన్న..

అరేయ్.. మిత్రమా.. అర్జెంటు గా.. మెదక్ నుండి
 లైవ్ కు రా.. ఓవర్ చేయకు..😭😭😭😭😭😭😭😭