సిఎం కెసిఆర్ పై మరోసారి పోరుబాట పట్టిన ఓయూఅభ్యర్థులందరికీ పరిహారం చెల్లించాలంటున్నారుసర్కారు నిర్వాకంతో నష్టపోయామని నిరుద్యోగుల ఆవేదనపరిహారం కోసం పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక 

తెలంగాణ సర్కారు నిర్వాకం వల్ల నష్టపోయామని నిరుద్యోగులు ఆందోళన మొదలు పెట్టిర్రు. ప్రభుత్వం తీరు కారణంగా నష్టపోయిన అభ్యర్థులందరికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాల గడ్డ ఉస్మానియాలో మరో ఉద్యమం రాజుకుంది. దీంతో తెలంగాణ సర్కారుకు కొత్త తలనొప్పి షురూ అయింది.

తెలంగాణ సిఎం కెసిఆర్ పై ఓయూ మరోసారి విరుచుకుపడింది. కెసిఆర్ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపింది ఓయూ. వివాదాస్పదమైన జివోలు తీసి ఉద్యోగ ప్రకటనల్లో అర్ధం పర్థంలేని నిబంధనలు పెట్టి నిరుద్యోగుల జీవితాలతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని నిరుద్యోగ జెఎసి మండిపడింది. సిఎం వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్ వద్ద నిరుద్యోగ జెఏసి ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ కాలబెట్టిర్రు.

నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైన జివోలు,నోటిఫికేషన్ నిబంధనలు రూపొందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్IPSని TSPSC ద్వారా పరీక్షలు నిర్వహించడం చేతకాని TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి ని విద్యపై అవగాహన లేని ఇతర TSPSC మెంబర్లను పదవులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జెఏసి గురుకుల టిజిటి పిజిటి నోటిఫికేషన్‌ విడుదలైనప్పుడే ఇది రాజ్యంగా వ్యతిరేకమైన నోటిఫికేషన్ అని సమాన అవకాశాలు కల్పించాలని గొంతు చించుకుని అరిచినా ఘంటా చక్రపాణి నిగాని,ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నిగాని ఎన్నిసార్లు కల్సినా పట్టించుకోలేదన్నారు. ఒకరిమీద ఒకరు చెపి తప్పించుకున్నారని పేర్కొన్నారు.

కోర్టుతీర్పు తో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు నిరుద్యోగులను బలి చేయొద్దన్నారు. అన్ని నోటిఫికేషన్లను సవరించి రాజ్యంగా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి తిరిగి నోటిఫికేషన్ విడుదలచేయాలన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా మెయిన్స్ ను డిఎస్సీ తరహాలో పాత పద్ధతిలో మూడునెలల్లో టిజిటి మరియు పిజిటి ఇతర పరీక్షలను నిర్వహించి భర్తీ చేయాలన్నారు.ఇకనుంచి విడుదల చేసే ప్రతినోటిఫికేషన్ లో న్యాయ పరమైన చిక్కులు లేకుండా జివోలు మరియు ఉద్యోగ నిబంధనలు లు రూపొందించాలన్నారు.

డిఎస్సీ సిలబస్‌ ముందుగా ప్రకటించి, తెలుగు అకాడమి నూతన సిలబస్‌ ప్రకారం ప్రామాణిక పుస్తకాలు ముద్రించి అందరికి అందుబాటులో కి పుస్తకాలు వచ్చాకే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నరు. TSPSC ద్వారా కాకుండా పాతవిధానాల ద్వారా డిఎస్సీ ల ద్వారా పాత పద్ధతిలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జెఏసి నాయకులు సుబ్బూరు మహేష్ ,మల్లేష్,వరపర్ల అనీల్, మస్కాపురం నరేష్, బూసిపల్లి లచ్చిరెడ్డి,వనం కిరణ్,గంజి శ్రీనివాస్ గంగాధర్‌,మల్లికార్జున్ రెడ్డి,రవిరాజు తదితరులు పాల్గొన్నారు.