ప్రియాంకరెడ్డి హత్య కేసు: రంగంలోకి కేటీఆర్, తానే పర్యవేక్షిస్తానంటూ ట్వీట్
ప్రియాంకరెడ్డిపై దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తన ట్వీట్ లో తెలిపారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసుపై తెలంగాణ ఐటీ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రియాంకరెడ్డి హత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంకరెడ్డి హత్య దురదృష్టకరమన్నారు.
ప్రియాంకరెడ్డిపై దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తన ట్వీట్ లో తెలిపారు మంత్రి కేటీఆర్.
ప్రియాంకరెడ్డి హత్య కేసును ఇకపూ తానే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్.
ఇకపోతే ఈనెల 27న డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
లారీలను అడ్డం పెట్టి ప్రియాంకపై అత్యాచారం, హత్య..?: పోలీసుల వద్ద ఆధారాలు
దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కుటుంభ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావాలనే ప్రియాంకరెడ్డి స్కూటీ పంక్చర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
యువతి దారుణ హత్య: ఎవరీ ప్రియాంక రెడ్డి?
లారీల మధ్య ప్రియాంకరెడ్డిని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని విచారణలో తేలింది. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.