Hyderabad: తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు అన్నారు. అలాగే, 'సింగిల్ ఫిల్టర్ టెక్నిక్'ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయ‌న పేర్కొన్నారు. 

T Harish Rao: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆరోగ్య సేవ‌లు ఎంతో మెరుగుప‌డ్డాయ‌ని ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పారు. అలాగే, 'సింగిల్ ఫిల్టర్ టెక్నిక్'ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయ‌న పేర్కొన్నారు. 

హైద‌రాబాద్ లోని వెంగల్‌రావునగర్‌లో మంగళవారం జరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, డయాలసిస్‌ రోగులకు ప్రతినెలా ఆసరా పింఛన్‌ అందజేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటికే 5000 మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు ఇస్తున్నామనీ, 1000 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని తెలిపారు. అలాగే, 'సింగిల్ ఫిల్టర్ టెక్నిక్'ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ వ్యూహాల నుండి ప్రేరణ పొందిన తరువాత తమిళనాడు స‌హా అనేక ఇతర రాష్ట్రాలు కూడా సింగిల్ ఫిల్టర్‌ల వినియోగాన్ని స్వీకరించాయ‌ని హ‌రీష్ రావు అన్నారు. ‘‘కేసీఆర్‌ ప్రారంభించిన సింగిల్‌ యూజ్‌ డయాలసిస్‌ విధానం వల్ల తెలంగాణలో వైద్యరంగంలో విప్లవం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తన సంక్షేమ చర్యలు, సామాజిక భద్రత వ్యూహంలో భాగంగా పేదలందరికీ సురక్షితమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో 'ఆసరా' పింఛన్లను ప్రవేశపెట్టింది”అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. గతంలో హైదరాబాద్‌లోని మూడు ఆసుపత్రులు మాత్రమే డయాలసిస్ సేవలను అందిస్తుండగా, నేడు రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య 3 నుండి 83 కేంద్రాలకు పెరిగిందని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ రోగుల సేవల కోసం డయాలసిస్ సేవ, కిడ్నీ మార్పిడి సేవలు, జీవితకాలం పాటు శస్త్రచికిత్స అనంతర ఖర్చులు (ఔషధాలు) కోసం సుమారు 700 కోట్లు ఖర్చు చేస్తోంద‌ని తెలిపారు. ఈ సేవలను వారి జిల్లాల్లోని రోగులకు అందుబాటులో ఉండేలా ప్ర‌భుత్వం చూస్తోంద‌ని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రోగుల కోసం గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి కేంద్రం అమల్లోకి వచ్చిందనీ, మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఒక్కొక్కరికి 'ఆరోగ్యశ్రీ పథకం' కింద పది లక్షలు ఇస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సేవ‌ల‌ను వివ‌రిస్తూ.. 

  • సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ ప్రక్రియ కోసం రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఒక్కోదానికి కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు.
  • దేశంలోనే తొలిసారిగా రోగుల సౌకర్యార్థం బస్ పాస్ సేవలు అందించబడ్డాయి.
  • ప్రతినెలా ఆసరా పింఛన్‌ అందజేస్తామన్నారు.
  • అవసరానికి కిడ్నీ మార్పిడి కూడా చేస్తార‌ని తెలిపారు. 
  • ఫ్లోరైడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయనీ, ఈ సమస్యను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉపరితల జలాలను శుద్ధి చేసే పనిని చేపట్టిందని తెలిపారు.
  • బీపీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు హెల్త్ ప్రొఫైల్ చెకప్‌లు నిర్వహించి ప్రతి నెలా మందులు అందజేస్తామని మంత్రి తెలిపారు.
కాగా, ప్ర‌జా ఆరోగ్యం విష‌యంలో ప్ర‌భుత్వం మెరుగైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటోందని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఇప్ప‌టికే ఐదు వేల మందికి పింఛన్‌ కార్డులను ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) మంజూరు చేశారని చెప్పిన మంత్రి.. ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రతి సంవత్సరం అనేక మంది రోగుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కేంద్రాలు ప్రారంభమవుతున్నాయ‌ని తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, గాంధీ నెఫ్రాలజీ విభాగం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ట్రాన్స్ ప్లాంటేషన్లు, డయాలసిస్ చేయించుకోకుండా నిరోధించనుంది. ఇదే ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రులకు నిధులను అందించిందని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు రోగుల‌కు 'ఆసరా పింఛన్‌ కార్డులు' పంపిణీ చేసిశారు. తెలంగాణలో త్వరలో 'టెలి మెంటల్‌ హెల్త్‌ సేవలు' ప్రారంభం కానున్నాయని ఆయ‌న‌ ప్రకటించారు.