Asianet News TeluguAsianet News Telugu

నేడు తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలు: మార్కుల కేటాయింపు ఇలా

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలకానున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులతో పాటు సెకండియర్ విద్యార్థులను కూడ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. 

Telangana intermediate second year results willbe realeased today lns
Author
Hyderabad, First Published Jun 28, 2021, 2:45 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలకానున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులతో పాటు సెకండియర్ విద్యార్థులను కూడ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. 

విద్యార్థులకు ఫస్టియర్ లో వచ్చిన మార్కులను సెకండియర్ లో ఇవ్వనున్నారు. పరీక్షా ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే జీవో జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 73 వేల 967 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులుండగా వారిలో లక్షా 99 వేల 19 మంది విద్యార్థులు ఫస్టియర్ లో ఫెయిలయ్యారు.  ఫెయిలైన సబ్జెక్టుల్లో కూడ ఆ విద్యార్థులకు పాస్ మార్కులు అందించనున్నారు.  ప్రాక్టికల్స్ లో 100 శాతం మార్కులు కేటాయించనున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలనే దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా  ప్రభుత్వం  మార్కులను కేటాయించనుంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios