తెలంగాణ : ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల.. ఎలా, ఎక్కడ డౌన్ లోడ్ చేసుకోవాలంటే...
తెలంగాణలోనేడు ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదల కానున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల అవుతున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. tsbie.cgg.gov.in లోకి వెళ్లి మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈఎస్ఎస్ఎస్ సి లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తో థియరీ పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ లేదా సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ తో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్లో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే.. ఉదాహరణకు ఫోటో తప్పుగా పడడం…సంతకాలు, ఇతర వివరాలు ఏవైనా తప్పుగా పడినట్లయితే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి.. సరిదిద్దుకునే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంతకుముందే ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సమయం ప్రతిరోజు ఉదయం 9 నుండి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Adluru Laxman : అర్ధరాత్రి ప్రభుత్వ విప్ కారు బోల్తా ... అడ్లూరి లక్ష్మణ్ కు గాయాలు
షెడ్యూలు ప్రకారం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫస్ట్ ఇయర్..
ఫిబ్రవరి 28 - పార్ట్ - 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్)
మార్చ్ 1 - పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్ వన్)
మార్చి 4 - పార్ట్ 3 (మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1)
మార్చి 6 - మాథెమాటిక్స్ పేపర్ -1బి, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మార్చి 11 - ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్ -1
మార్చి 13 - కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1
మార్చి 15 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ -1 ( బిఐపిసి విద్యార్థులకి)
మార్చి 18 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ తేదీలు..
ఫిబ్రవరి 29 - పార్ట్ 2 ( సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2)
మార్చి 2 - పార్ట్ 1 ( ఇంగ్లీష్ పేపర్-2)
మార్చి 5 - పార్ట్-3 ( మ్యాథ్స్ పేపర్2A, బోటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2)
మార్చి 7 - మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చ్12 - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ -2 , కామర్స్ పేపర్ -2
మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ -2 ( బిఐపిసి విద్యార్థులకు)
మార్చి 19 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2