ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను (TS Inter 1st Year Results 2021) తెలంగాణ ఇంటర్ బోర్డ్ (telangana inter board) విడుదల చేసింది. ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4,59,242 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను (TS Inter 1st Year Results 2021) తెలంగాణ ఇంటర్ బోర్డ్ (telangana inter board) విడుదల చేసింది. ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4,59,242 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.
కరోనా కారణంగా పోస్ట్‌పోన్..
ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థుల పరీక్షలు కరోనా రెండో వేవ్ (corona second wave) సందర్భంగా వాయిదా వేశారు. ఆ ఎగ్జామ్స్‌ను అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు నిర్వహించారు. ఇటీవలే ఆ పరీక్ష పేపర్ల వాల్యూవేషన్ పూర్తి కావడంతో ఫలితాలు ప్రకటించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్‌లో విద్యార్థులు ఫలితాలను చూడవచ్చు.
ఈ బ్యాచ్‌కు మొదటి నుంచీ కరోనా తిప్పలే..
2020 మార్చ్‌లో కరోనా వల్ల లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో అప్పుడు ఇంటర్ స్టూడెంట్స్‌కు ఎగ్జామ్స్ అయిపోయాయి. అదే సమయంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికే కొన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కానీ లాక్ డౌన్ వల్ల అన్నీ పరీక్షలను వాయిదా వేశారు. అప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆ పదో తరగతి విద్యార్థులందరినీ ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేశారు. అయితే అప్పటికే ఎగ్జామ్స్ రాసి ఉన్న ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఫెయిలయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Also Read:తెలంగాణలో నేడు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్..
ఆ సమయంలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో జాయిన్ అయ్యారు. కానీ సరిగ్గా వారి పరీక్షల సమయంలో మళ్లీ కరోనా రెండో వేవ్ వచ్చింది. మళ్లీ లాక్ డౌన్ విధించడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండానే వారిని ప్రమోట్ చేశారు. ఇలా ఈ బ్యాచ్ వారికి రెండు సార్లు పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే వారిని డైరెక్ట్ గా సెకెండ్ ఇయర్ లోకి ప్రమోట్ చేస్తే.. ఇక ఫస్టియర్ పరీక్షలు ఉండవని అందరూ అనుకున్నారు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిని తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందులో భాగంగా షెడ్యూల్ విడుదల చేసి అక్టోబర్ చివరి వారంలో పరీక్షలు ప్రారంభించింది.
