Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ‌లో నేడు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్‌..

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో నిర్వహించారు. ఇటీవలే వాల్యూయేషన్ పూర్తి చేశారు. నేడు ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Interfaith Exams Results in Telangana Today ..
Author
Hyderabad, First Published Dec 16, 2021, 12:18 PM IST

తెలంగాణ విద్యా శాఖ నేడు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించ‌డానికి స‌న్న‌హ‌కాలు చేస్తోంది. నిజానికి ఈ ఫ‌లితాలు నిన్నే ప్ర‌క‌టించాల్సి ఉన్న కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈరోజు విడుదల చేయ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం త‌రువాత ఫ‌లితాల‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

క‌రోనా కార‌ణంగా పోస్ట్‌పోన్..
ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ చ‌దివే విద్యార్థుల ప‌రీక్ష‌లు క‌రోనా రెండో వేవ్ సందర్భంగా వాయిదా వేశారు. ఆ ఎగ్జామ్స్‌ను అక్టోబ‌ర్ చివ‌రి వారం నుంచి న‌వంబ‌ర్ మొద‌టి వారం వ‌ర‌కు నిర్వ‌హించారు. ఇటీవ‌లే ఆ ప‌రీక్ష పేప‌ర్ల వాల్యూవేష‌న్ పూర్తి కావ‌డంతో ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంట‌ర్ బోర్డు అఫీషియ‌ల్ వెబ్ సైట్‌లో ఈ ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు. tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్‌లో విద్యార్థులు ఫ‌లితాల‌ను చూడ‌వ‌చ్చు. 

ఒమిక్రాన్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్:ప్రైమరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు

ఈ బ్యాచ్‌కు మొద‌టి నుంచీ క‌రోనా తిప్ప‌లే..
2020 మార్చ్‌లో క‌రోనా వ‌ల్ల లాక్ డౌన్ విధించారు. ఆ స‌మ‌యంలో అప్పుడు ఇంట‌ర్ స్టూడెంట్స్‌కు ఎగ్జామ్స్ అయిపోయాయి. అదే స‌మ‌యంలో టెన్త్ ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. అప్ప‌టికే కొన్ని ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయి. కానీ లాక్ డౌన్ వ‌ల్ల అన్నీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. అప్ప‌ట్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రినీ ఇంట‌ర్న‌ల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేశారు. అయితే అప్ప‌టికే ఎగ్జామ్స్ రాసి ఉన్న ఇంట‌ర్ ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. ఫెయిల‌యిన విద్యార్థుల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. ప‌రీక్ష ఫీజు క‌ట్టిన విద్యార్థులంద‌రినీ పాస్ చేస్తున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డు ప్ర‌కటించింది. 
ఆ స‌మ‌యంలో ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయిన విద్యార్థులు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో జాయిన్ అయ్యారు. కానీ స‌రిగ్గా వారి ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మ‌ళ్లీ క‌రోనా రెండో వేవ్ వ‌చ్చింది. మ‌ళ్లీ లాక్ డౌన్ విధించ‌డంతో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే వారిని ప్ర‌మోట్ చేశారు. ఇలా ఈ బ్యాచ్ వారికి రెండు సార్లు ప‌రీక్ష‌లు క్యాన్సిల్ అయ్యాయి. అయితే వారిని డైరెక్ట్ గా సెకెండ్ ఇయ‌ర్ లోకి ప్ర‌మోట్ చేస్తే.. ఇక ఫస్టియ‌ర్ ప‌రీక్ష‌లు ఉండ‌వ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అలా చేస్తే భ‌విష్య‌త్తులో ఆ విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని భావించిని తెలంగాణ విద్యాశాఖ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని భావించింది. అందులో భాగంగా షెడ్యూల్ విడుదల చేసి అక్టోబ‌ర్ చివ‌రి వారంలో ప‌రీక్ష‌లు ప్రారంభించింది. 
అయితే ఈ విద్యార్థుల‌కు మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌త్య‌క్ష త‌రగ‌తులు నిర్వ‌హించ‌లేదు. మొద‌టి సారి లాక్ డౌన్ ఎత్తేసిన స‌మ‌యంలో కొన్ని రోజులు కాలేజ్‌లు ఓపెన్ చేశారు. కానీ క‌రోనా సెకెండ్ వేవ్ మ‌ళ్లీ విజృంభించ‌డంతో అన్ని విద్యాసంస్థ‌లు మూసివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక అప్ప‌టి నుంచి వారంద‌రికీ ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వ‌హించారు. అయితే చాలా మంది స్టూడెంట్ల ద‌గ్గ‌ర ఆన్లైన్ లో క్లాసులు విన‌డానికి స‌రైన ప‌రిక‌రాలు లేవు. కొన్ని చోట్ల సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది స్టూడెంట్లు పాఠాల‌కు దూర‌మ‌య్యారు. రెండో ఏడాది ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో వారికి మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు పెట్టారు. దీంతో చాలా మంది స్టూడెంట్లు ప‌రీక్ష‌లు స‌రిగా రాయ‌లేకపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios