Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి: లేకపోతే రూ. 1000 ఫైన్

తెలంగాణలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మాస్క్ ధరించకపోతే రూ. 1000 ఫైన్ విధించనుంది. 

Telangana imposes Rs1,000 penalty for not wearing mask
Author
Hyderabad, First Published Dec 2, 2021, 1:42 PM IST

హైదరాబాద్: తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. Telangana రాష్ట్రంలో Corona కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం  Mask తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.  ఇదే రకమైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కూడా జారీ చేసింది. కరోనా కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ను తప్పనిసరి చేసిందిఅంతేకాదు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని కోరింది. వ్యాక్సిన్ పై కచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం కచ్చితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ ను విధించనున్నారు.

also read:బూస్ట‌ర్ డోస్‌గా కోవిషీల్డ్ వేసుకోవ‌చ్చు.. అనుమ‌తిచ్చిన డీసీజీఐ

తెలంగాణ సర్కార్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 188 కింద ఈ ఫైన్ విధించనున్నారు. అయితే ఈ జీవో విడుదల చేసిన రెండు వారాలకే తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 31 కోట్లను Fine రూపంలో వసూలు చేసింది. ప్రజలు మాస్క్ లేకుండా తిరిగిన వారి నుండి  ఈ జరిమానాను వసూలు చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా Omicron వైరస్ భయపెడుతుంది. దీంతో  ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ ను తప్పనిసరి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. 

  బ్రిటన్ నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

ప్రపంచంలోని  20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.  విదేశాల నుండి వచ్చిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు., ఆమెకు  టిమ్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. జీనోమ్ సిక్వీన్స్ కి  ఆమె నమూనాలు పంపించామన్నారు.సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారన్నారు. విదేశాల  నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios