తమ ఒకరోజు జీతాన్ని కేరళ వరద బాధితులకు అందించాలనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందిస్తామంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారులు ముందుకు వచ్చారు. తమ ఒకరోజు జీతాన్ని కేరళ వరద బాధితులకు అందించాలనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇదేవిషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులందరి ఒక్క రోజు జీతాన్ని కట్ చేసి.. తమ పేరు మీద కేరళ సీఎం సహాయ నిధికి పంపాల్సిందిగా కోరుతూ ఐఏఎస్ అధికారి, హోమ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ లేఖ రాశారు. ఈ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి వీరు అందజేశారు.