తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల: అక్టోబర్ 28న స్పాట్ ఆడ్మిషన్లు

అక్టోబర్ 8వ తేదీ నుండి ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇవాళ తెలంగాణ ఉన్నత విద్యా మండలి  కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 28న స్పాట్ సీట్లను కేటాయిస్తారు.
 

Telangana I -Cet Counselling To Begin From october 8

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుండి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న స్పాట్ సీట్లను కేటాయించనున్నారు. 

ఐసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఏడాది జూలైలో 23న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. మొత్తం 76, 160 మంది విద్యార్ధులు ఈ పరీక్షల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ ఐసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ ను నిర్వహించింది. 

 ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుండి 28వ  తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.ఈ అక్టోబర్ 8వ తేదీన  తొలి విడత కౌన్సిలింగ్  ప్రారంభిస్తారు. అక్టోబర్ 8 నుండి 12వ తేదీ వరకు అభ్యర్ధుల సర్టిపికెట్ల పరిశీలనతో పాటు స్లాట్ బుకింగ్  చేసుకోవాలి. అక్టోబర్ 10 నుండి 13 వరకు అభ్యర్ధుల సర్టిపికెట్లను పరిశీలిస్తారు. 

అక్టోబర్ 10 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్లను కేటాయిస్తారు.  ఈ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తైన తర్వాత అక్టోబర్ 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది.అక్టోబర్ 28నఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లను కేటాయించనున్నారు. అక్టోబర్ 28న  స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios