అక్కడ ఉన్నవాళ్లంతా తెలంగాణ ప్రభుత్వంలో హేమాహేమీలే. అందులో ఒకరు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ. ఇంకొకరు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. ఇంకొకరు మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి.

వీళ్లంతా టిఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లలో ఉన్నారు. పనిలో పనిగా కళాకారులు పాటలు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఈ పెద్దలు కళాకారుల పాటలకు స్టెప్పులేశారు. ఎంపి మల్లారెడ్డి డ్యాన్స్ లో దుమ్ము రేపగా.. హోంమంత్రి నాయిని బాగానే డ్యాన్స్ చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాత్రం డ్యాన్స్ చేయలేదు. పక్కన కళాకారులతో పోటీ పడి డ్యాన్స్ చేశారు నాయిని, మల్లారెడ్డి.

డ్యాన్స్ వీడియో పైన ఉంది మీరూ ఒక లుక్కేయండి.