Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు: డీజీపీ, హైదరాబాద్ సీపీలతో హోంమంత్రి భేటీ.. దర్యాప్తుపై ఆరా

సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు తీవ్రత నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు. 
 

telangana home minister mahmood ali review meeting with dgp mahender reddy and cp anjani kumar over saidabad rape case
Author
Hyderabad, First Published Sep 15, 2021, 7:16 PM IST

సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఘటన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా వున్నారని ఆయన తెలిపారు.

నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో కేసీఆర్ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని హోంమంత్రి తెలిపారు. 

ALso Read:సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు: డీజీపీ, హైదరాబాద్ సీపీలతో హోంమంత్రి భేటీ.. దర్యాప్తుపై ఆరా

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు పోలీసులు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు వుంటుందని.. ఎత్తు సుమారు 5.9 అడుగులు వుంటుందని అంజనీ కుమార్ చెప్పారు. పెద్ద జుట్టుకు రబ్బరు బ్యాండ్ వేసుకుని తిరుగుతారని సీపీ స్పష్టం చేశారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అనే టాటూ వుంటుందని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios