Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం: పోలీసులకు హోంమంత్రి మహమూద్ అలీ కీలక ఆదేశాలు

గాంధీ ఆసుపత్రి సామూహిక అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని హోంమంత్రి ఆదేశించారు.

telangana home minister mahmood ali review meeting on gandhi hospital gang rape case
Author
Hyderabad, First Published Aug 17, 2021, 7:43 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రి సామూహిక అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ హాజరయ్యారు.

కాగా, గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదు కాపీ మీడియాకు అందింది. దీని ప్రకారం ఈ నెల 5న తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేసింది బాధితురాలు. గాంధీలో ఎక్స్‌రే విభాగంలో పనిచేస్తున్న ఉమా మహేశ్‌ సహాయంతో అడ్మిట్ చేశారు బాధితురాలు ఆమె సోదరి. అక్కతో కలిసి గాంధీలోనే వుంటోంది బాధితురాలు. అడ్మిట్ అయిన మూడు రోజుల తర్వాత అక్కాచెల్లెళ్ల దగ్గరికి ఉమా మహేశ్వర్, సెక్యూరిటీ గార్డు వచ్చారు.

Also Read:గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: కీలక విషయాలు సేకరించిన పోలీసులు

ఈ సందర్భంగా ఔట్ పేషెంట్ వార్డ్ దగ్గర సెక్యూరిటీ రూంలోనికి బాధితురాలిని తీసుకెళ్లాడు ఉమా మహేశ్వర్. బాధితురాలి ముక్కుకు మత్తు మందు ఉన్న ఖర్చీఫ్‌ను పెట్టాడు ఉమా మహేశ్. దీంతో పాటు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్పృహలోకి వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగినట్లు  బాధితురాలు గుర్తించింది. తనపై ఉమా మహేశ్‌తో పాటు సెక్యూరిటీ గార్డు కూడా అత్యాచారం చేసినట్లు బాధితురాలు నిర్ధారించింది. కొద్దిసేపటికి సెక్యూరిటీ గార్డ్ రూం దగ్గరికి బాధితురాలి సోదరి కుమారుడు అరుణ్ వచ్చాడు.

అక్కడి నుంచి నేరుగా తమ స్వగ్రామానికి వెళ్లిపోయింది బాధితురాలు. అక్కడ తన సోదరి కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని అరుణ్‌కు చెప్పింది బాధితురాలు. అక్క ఆచూకీ కనిపెట్టడం కోసం మంగళవారం తిరిగి గాంధీ ఆసుపత్రికి వచ్చింది బాధితురాలు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో గాలించింది. సోదరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్‌తో పాటు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులపై 342, 376 డీ, 328 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios