Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రోహింగ్యాల నిర్భందాన్ని తప్పుపట్టిన హైకోర్టు..

హైదరాబాద్‌లో రోహింగ్యాల నిర్భందాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రోహింగ్యాలను నిర్భంధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. 

Telangana High Court verdict On petitions challenging detention of Rohingya
Author
First Published Sep 15, 2022, 3:32 PM IST

హైదరాబాద్‌లో రోహింగ్యాల నిర్భందాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రోహింగ్యాలను నిర్భంధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రోహింగ్యాలను చర్లపల్లి జైలులో నిర్భందించడం చట్ట విరుద్దమని పేర్కొంది. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ఆధారంగా అనుమతి లేకుండా ఉన్న రోహింగ్యాలను గతేడాది పోలీసులు జైలుకు పంపారు. అయితే వారి బంధువులు పోలీసుల నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. 

దీనిపై రోహింగ్యాల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. జైలుకు తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. రోహింగ్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే ఉంటుందన్న వాదించారు. విదేశీయుల చట్టం ప్రకారం రోహిగ్యాలను అరెస్ట్ చేసే అధికారం కేంద్రానికే ఉందన్నారు. ఈ క్రమంలోని అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరించిన హైకోర్టు.. రోహింగ్యాల నిర్బంధ ఉత్తర్వులను కొట్టివేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios