తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్ధులకు ఊరట లభించింది. గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,032 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని సూచించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్ధులను పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.

దీనిపై స్పందించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి హైకోర్టు తీర్పును స్వాగతించారు. త్వరలో మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.