12 మంది ఆలిండియా అధికారుల  కేడర్ కేటాయింపు  విషయమై విచారణను  జూన్ 5వ తేదీన తెలంగాణ హైకోర్టు విచారించనుంది.  

ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను రెండు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం. అయితే కేంద్ర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే హైకోర్ట్ ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఈ క్రమంలో డీజీపీ అంజనీ కుమార్ సహా తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 5న ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. కేంద్రం రంగంలోకి దిగింది. 

క్యాట్ తీర్పు ఆధారంగా ఐపిఎస్ లు అంజనీ కుమార్,అభిలాష్ భిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాధ్ లు తెలంగాణలో కొనసాగుతున్నారు. మరో వైపు ఈ తీర్పు ప్రకారంగా ఐఎఎస్ అధికారులు వాణి ప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రొస్, ,ఆనంతరాము, శ్రీజన,శివశంకర్, మల్లెల ప్రశాంతిలు తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు