Asianet News TeluguAsianet News Telugu

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు ప్రత్యేక బృందంతో విచారణ: బీజేపీ పిటిషన్ పై రేపుతెలంగాణ హైకోర్టు తీర్పు

మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రత్యేక బృందంతో  విచారించాలని బీజేపీ  దాఖలు చేసిన  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. ఇరు వర్గాల వాదనలు వింది. రేపు తీర్పును  వెల్లడించనుంది.

Telangana High Court To Deliver Verdict tomorrow on BJP Petition  Over Moinabad Farm house Case
Author
First Published Nov 7, 2022, 5:07 PM IST


హైదరాబాద్:మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రత్యేక బృందంతో  విచారణ జరిపించాలని కోరుతూ  బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు తీర్పు వెల్లడించనుంది.మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని  టీఆర్ఎస్  ఆరోపించింది. అంతేకాదు తాండూరు ఎమ్మెల్యే రోహిత్  రెడ్డి ఇచ్చిన  ఫిర్యాదు  మేరకు  ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు.

ఢిల్లీకి  చెందిన  రామచంద్రభారతి, ఏపీకి చెందిన  సింహయాజీ, హైద్రాబాద్ కు చెందిన నందకుమార్ లు తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని  టీఆర్ఎస్ ఎమ్మెల్యే  రోహిత్  రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే పాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి  సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కేసును  ప్రత్యేక బృందంతో  విచారణ చేయించాలని ఆ పార్టీ తెలంగాణ హైకోర్టులో గత నెల 27న పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై  ఇవాళ  విచారణ  నిర్వహించింది హైకోర్టు.ఇరు వర్గాల వాదనలను కోర్టు వింది.బీజేపీ దాఖలు  చేసిన పిటిషన్  పై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. 

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడంపై హైకోర్టు ఆరా

తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టిన  ఘటనలో బీజేపీ ప్రమేయం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సీఎం  కేసీఆర్ ఈ  నెల 3న నిర్వహించిన  మీడియా సమావేశంలో  ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. బీజేపీకి చెందిన కొందరు నేతల  పేర్లు కూడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు  ప్రస్తావించడాన్ని  ఆయన  గుర్తు చేశారు. 

అయితే  ఈ వ్యవహరంతో తమకు సంబంధం లేదని బీజేపీ  చెబుతుంది.సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణను డిమాండ్ చేస్తుంది. ఈ కేసును  తెలంగాణ పోలీసులు చేయడం  వల్ల  ప్రయోజనం ఉండదని  ఆ పార్టీ అభిప్రాయంతో  ఉంది. అందుకే ప్రత్యేక  బృందంతో విచారణను  బీజేపీ  కోరుతుంది.బీజేపీ  పిటిషన్ పై  ఈ నెల 4వ తేదీన విచారణ నిర్వహించింది హైకోర్టు. ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ నిర్వహించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios