తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. వీఆర్ఏలను సర్దుబాటు చేస్తు కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. వీఆర్ఏలను సర్దుబాటు చేస్తు కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు కోర్టుకెక్కడంతో తాజా జీవోలను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. అంతేకాదు.. జీవోలకు ముందున్న స్థితినే కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. పలువురు వీఆర్ఏల పిటిషన్‌లపై విచారణ అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.