Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు: ఛైర్మన్, బోర్డ్ సభ్యులపై ... తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

మహేశ్ బ్యాంక్ కేసు (ap mahesh bank) మరో కీలక మలుపు తిరిగింది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు (telangana high court).. మహేశ్ బ్యాంక్ ఛైర్మన్, డైరెక్టర్స్‌పై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. 

telangana high court serious on ap mahesh bank board members
Author
Hyderabad, First Published Nov 12, 2021, 5:05 PM IST

మహేశ్ బ్యాంక్ కేసు (ap mahesh bank) మరో కీలక మలుపు తిరిగింది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు (telangana high court).. మహేశ్ బ్యాంక్ ఛైర్మన్, డైరెక్టర్స్‌పై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ నెల 16న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 

ఇదిలావుంటే.. ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సహా సీఈవో, వైస్‌ చైర్మన్‌లపై కేసు నమోదయిందైన సంగతి తెలిసిందే. బోగస్‌ ఓటర్ల నమోదు, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా గోల్డ్‌లోన్‌ (gold loan) జారీ అభియోగాలపై గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు.. బంజారాహిల్స్‌ ఈ ఏడాది మార్చి నెలలో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఏపీ మహేష్‌ బ్యాంక్‌ .. కో-ఆపరేటివ్‌ బ్యాంకింగ్‌కు కార్పొరేట్‌ బిల్డప్ ఇస్తూ బిజినెస్‌తో పాటు బ్రాంచ్‌లు పెంచుకుంది. అంతేకాదు ఒకేరోజులో 850 మంది గోల్డ్‌ లోన్‌లు మంజూరు చేసి సంచలనం రేపిన చరిత్ర మహేష్‌ బ్యాంక్‌ది. అయితే బ్యాంక్‌ ఎన్నికల కోసం ఇదంతా కుట్ర అనే విమర్శలు వెల్లువెత్తాయి అప్పట్లో. సుదీర్ఘకాలం చైర్మన్‌‌గా వ్యవహరిస్తున్న రమేష్‌ భంగ్‌.. ఓట్ల కోసం గోల్డ్‌లోన్‌ ఎత్తుగడ వేశారని.. ఫిర్యాదు కూడా నమోదైంది. తాజాగా ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రమేష్‌ భంగ్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.

Follow Us:
Download App:
  • android
  • ios