హైదరాబాద్:  భూముల రిజిస్ట్రేషన్ల కోసం  ఆధార్ వివరాలు అడగడంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఆదేశించక తప్పదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టులో  గురువారం నాడు విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సందర్భంగా  ఆధార్  వివరాలను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. ఆధార్ ఇవ్వడం ఇష్టమా లేదా అనే ప్రశ్న ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. 

also read:ధరణి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆధార్ వివరాలు ఇవ్వడం లేనివారికి ప్రత్యామ్నాయం ఉందన్న ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఐచ్ఛికంగా కూడా ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళనానికి గురి చేయవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.క్రయ విక్రయదారులతో పాటు సాక్షుల ఆధార్ అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.ఆధార్, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించి వివరణ ఇస్తానని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

రిజిస్ట్రేషన్ల వివరాల కోసం ఆధార్ వివరాల నమోదుపై హైకోర్టుకు సీఎస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ  పిటిషన్ పై విచారణను ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.