హైదరాబాద్:వ్యవసాయేతర ఆస్తులను పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్ ను బుక్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్తి పన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలనే నిబంధనకు హైకోర్టు అంగీకరించింది. 

also read:పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించొచ్చు: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్ ను ఈ నెల 8వ తేదీన హైకోర్టు విచారించిన విషయం తెలిసిందే, దీనికి కొనసాగింపుగా ఇవాళ హైకోర్టు విచారణ చేసింది.  వ్యవసాయేతర  ఆస్తులను పాత పద్దతిలోనే  రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు వెసులుబాటును కల్పించింది.ఈ విషయమై ఎలాంటి స్టే ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది

ధరణిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు