హైదరాబాద్: నైట్ కర్ఫ్యూ ముగుస్తున్నందున ఏం చర్యలు తీసుకొంటున్నారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు నిర్ణయాన్ని ప్రకటించకపోతే మేమే ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. శుక్రవారం నాడు  తెలంగాణ హైకోర్టు కరోనాపై విచారణ నిర్వహించింది. నైట్ కర్ఫ్యూ ముగుస్తుంటే ఏం చర్యలు తీసుకొన్నారని  హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి కార్యాచరణను తెలపాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. 

also read:నైట్ కర్ఫ్యూపై నేడు తెలంగాణ సర్కార్ నిర్ణయం: మరికొన్ని రోజులు పొడిగించే చాన్స్

నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశ్యం కాదని కోర్టు  తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చింది హైకోర్టు.  మధ్యాహ్నం తిరిగి హైకోర్టు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలని తెలపాలని హైకోర్టు కోరింది. 

 

 గతంలో కూడ కరోనా కేసుల విషయమై  తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ లేదా వీకేండ్ లాక్ డౌన్ ల గురించి ప్రశ్నించింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోకపోతే  తాము ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 20 నుండి రాష్ట్రంలో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.