Asianet News TeluguAsianet News Telugu

నైట్ కర్ఫ్యూపై నేడు తెలంగాణ సర్కార్ నిర్ణయం: మరికొన్ని రోజులు పొడిగించే చాన్స్

తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో ముగియనుంది. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకోనుంది. 
 

Telangana government likely to extend night curfew ln
Author
Hyderabad, First Published Apr 30, 2021, 10:32 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో ముగియనుంది. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 20వ తేదీ నుండి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూన విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గురువారం నాడు సమీక్స నిర్వహించారు.  రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 

also read:తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి: మొత్తం 4,35,606కి చేరిక

అయితే గతంలో కూడ  నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్  విధించే యోచన లేదని  మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన రెండు రోజులకే  నైట్ కర్ఫ్యేను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విషయమై ఇవాళ  సీఎస్  సమీక్ష నిర్వహించి నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఆయన సమీక్షిస్తారు.  రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.  అయితే ఈ సమీక్షలో నైట్ కర్ఫ్యూపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios