ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం: ఆర్టీసీ బకాయిల నివేదికపై కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో జరుగుతున్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా అంగీకరించాలని హెచ్చరించింది. ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వంపై మండిపడింది.  

telangana high court serious comments on government

హైదరాబాద్: ఆర్టీసీ బకాయిలపై తెలంగాణ హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం తరపున జనరల్ అడ్వకేట్ నివేదిక సమర్పించారు. ఆర్టీసీ చెప్పినట్లు ప్రభుత్వం బకాయి ఏమీ లేదని స్పష్టం చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు అప్పుల పంపకాలు జరగలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎందుకు ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు జరగలేదని కోర్టు ప్రశ్నించగా అది హైకోర్టు నిర్ణయమని చెప్పుకొచ్చారు.  

తెలంగాణా రాష్ట్రం వాటా రీయింబర్స్ మెంట్ డబ్బు రూ.1099 కోట్లు అని ప్రభుత్వంమే స్పష్టం చేసిందని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది.  రీయింబర్స్ మెంట్ బకాయిలు
రూ.1099  కోట్లు ఉన్నాయన్న సర్కారు

బకాయిల్లో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని పేర్కొన్నారు. బ్యూరోక్రాట్స్ వాస్తవాలను మరుగున పెడుతున్నారంటూ ఆరోపించారు. తెలివిగా మాట్లాడి నిజాలను దాస్తున్నారంటూ విమర్శించింది హైకోర్టు. 

బ్యాంకు గ్యారంటీ రూ.850 కోట్లు కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా ఎందుకు కట్టలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీలో జరుగుతున్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా అంగీకరించాలని హెచ్చరించింది.  

ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వంపై మండిపడింది. 4,253 అంటూ తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.850 కోట్లు కేవలం బ్యాంకు గ్యారంటీగా మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు ఇవ్వలేరా అంటూ మరోసారి ప్రశ్నించింది ధర్మాసనం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios